LOADING...
Papam Prathap: ఓటీటీలోకి 'పాపం ప్రతాప్‌'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఓటీటీలోకి 'పాపం ప్రతాప్‌'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Papam Prathap: ఓటీటీలోకి 'పాపం ప్రతాప్‌'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

వ్రాసిన వారు Moogati Shabari
May 05, 2026
01:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరువీర్‌, అజయ్ ఘోష్‌, రాశి, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సినిమా 'పాపం ప్రతాప్‌'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను బాగా అలరించింది. ఎస్పీ దుర్గా నరేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మే 7 నుంచి ఈటీవీ విన్‌ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని చిత్రబృందం పోస్టర్ ద్వారా వెల్లడించింది.

వివరాలు

కథ ఏంటంటే..

ప్రతాప్‌ (తిరువీర్‌) చిన్నప్పటి నుంచే బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)పై ప్రేమ పెంచుకుంటాడు. ఆ ప్రేమను సాధించేందుకు ఎంతో కష్టపడి చివరకు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తర్వాత ప్రేమ జీవితం ఎలా ఉంటుందో అనుభవించాలనే ఉద్దేశంతో ఇద్దరూ దాంపత్య జీవితం ప్రారంభిస్తారు. అయితే మొదటి మూడు రాత్రులు గడవకముందే వారి మధ్య విభేదాలు తలెత్తుతాయి. ప్రతాప్‌లో ఏదో సమస్య ఉందని చెప్పి బుజ్జమ్మ తన పుట్టింటికి వెళ్లిపోతుంది. కానీ ఆ సమస్య ఏమిటో మాత్రం ఎవరితోనూ చెప్పదు.

వివరాలు

కథలో అదిరిపోయే ట్విస్ట్ 

తనలో ఉన్న లోపాన్ని ప్రతాప్ స్వయంగా గుర్తించి సరిచేసుకున్న తర్వాత మాత్రమే తిరిగి వస్తానని ఆమె స్పష్టంగా చెబుతుంది. బుజ్జమ్మపై అపారమైన ప్రేమ కలిగిన ప్రతాప్ తనలోని సమస్యను తెలుసుకోవడానికి ఏం చేశాడు? అసలు ఆ సమస్య ఏమిటి? దాన్ని అతను అధిగమించగలిగాడా? చివరకు బుజ్జమ్మ, ప్రతాప్ మళ్లీ కలిసారా? అనే ప్రశ్నలకు సమాధానం ఈ చిత్రంలో తెలుస్తుంది.

Advertisement