Euphoria Trailer: 'మన కలల్ని కూడా తల్లిదండ్రులే కంటారు'.. ఆకట్టుకుంటున్న 'యుఫోరియా' ట్రైలర్!
ఈ వార్తాకథనం ఏంటి
తల్లిదండ్రులు మన జీవితంతో పాటు మన కలల్ని కూడా కంటారనే భావోద్వేగపూరితమైన లైన్‌తో 'యుఫోరియా' ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా, నీలిమా గుణశేఖర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందుగా చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.
Details
భావోద్వేగంగా ఆవిష్కరించిన డైరక్టర్ గుణశేఖర్
ట్రైలర్‌ను గమనిస్తే.. ఉన్నత భవిష్యత్తు ఉన్న యువత మాదకద్రవ్యాల మత్తులో పడితే వారి జీవితం ఎలా మారిపోతుంది, ఆ ప్రభావం వారి కుటుంబాలపై ఎంత తీవ్రంగా పడుతుంది అనే అంశాన్ని ప్రధాన కథాంశంగా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. యువత ఎదుర్కొనే సమస్యలు, తల్లిదండ్రుల ఆవేదన, బాధ్యతల మధ్య తారతమ్యాన్ని గుణశేఖర్ భావోద్వేగంగా ఆవిష్కరించినట్లు ట్రైలర్ సూచిస్తోంది.