LOADING...
Parineeti Chopra: సోషల్ మీడియాలో గుడ్ న్యూస్ పంచుకున్న పరిణీతి-రాఘవ్ చడ్డా
సోషల్ మీడియాలో గుడ్ న్యూస్ పంచుకున్న పరిణీతి-రాఘవ్ చడ్డా

Parineeti Chopra: సోషల్ మీడియాలో గుడ్ న్యూస్ పంచుకున్న పరిణీతి-రాఘవ్ చడ్డా

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2025
02:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డా (Raghav Chadha), బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) తమ అభిమానులకు సంతోషకరమైన న్యూస్ చెప్పారు. త్వరలోనే తమ దంపతుల జీవితంలో కొత్త అతిథి రాబోతున్నాడని సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇరువురూ చేతులు పట్టుకొని నడుస్తున్న వీడియోను పంచుకుంటూ.. 'మా చిన్ని ప్రపంచం.. త్వరలో మా జీవితాల్లోకి అడుగుపెడుతోందని పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Details

2023లో అంగరంగ వైభవంగా వివాహం

ఇటీవల వీరు పాల్గొన్న కపిల్ శర్మ షోలో మాట్లాడుతూ.. త్వరలో గుడ్ న్యూస్ చెబుతామని సంకేతాలు ఇచ్చారు. రాఘవ్-పరిణీతి 2023 సెప్టెంబర్‌లో రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా బంధువుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పరిణీతి చోప్రా, 2011లో వచ్చిన లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్, సినిమాతో నటిగా పరిచయమయ్యారు. తరువాత కిల్ దిల్, డిష్యూం, గోల్‌మాల్ అగైన్, కేసరి, సైనా వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇటీవల ఆమె నటించిన అమర్ సింగ్ చంకీల విజయవంతమైంది.