Pawan Kalyan : పవన్ చేతిలో ఆస్కార్ ట్రోఫీ! కీరవాణితో సరదాగా గడిపిన క్షణాలు వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'హరిహర వీరమల్లు' షూటింగ్ పూర్తయ్యింది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రేపు (మే 21) ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణిని పవన్ కళ్యాణ్ ఇటీవల కలిశారు.
రేపు విడుదల కానున్న పాట 'సలసల మరిగే నీలోని రక్తమే...'ను కీరవాణి పవన్‌కు ముందుగా వినిపించారు.
ఈ పాట విని పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పాట వింటే పౌరుషం తక్కువైన వారిలో పౌరుషం ఎక్కువ అవుతుందంటూ కీరవాణి ప్రతిభను కొనియాడారు.
Details
సంగీత ప్రయాణాన్ని వివరించిన కీరవాణి
ఆ సందర్భంగా కీరవాణి, పవన్‌కు తన సంగీత ప్రయాణం గురించి వివరించారు.
మొదట్లో సంగీత దర్శకుడు కె. చక్రవర్తి వద్ద శిక్షణ తీసుకున్న విషయాన్ని, అలాగే వేటూరి సుందర రామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి మహా కవులతో తనకున్న అనుబంధాన్ని వివరించారు.
తన స్టూడియోలో ఉన్న వయోలిన్‌ల గురించి కూడా పవన్‌తో చర్చించారు.
పవన్ కళ్యాణ్ స్వయంగా వయోలిన్ నేర్చుకున్న రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
ఇంతకుముందు తనకు నచ్చిన 32 కథలను ఒక పుస్తకంగా సంకలనం చేసి భద్రపరచుకున్న కీరవాణి, ఆప్రత్యేక పుస్తకాన్ని పవన్‌కు బహుకరించారు. ఈ బహుమతితో పవన్ చాలా ఆనందించారని సమాచారం.
మరోవైపు ఆర్ఆర్ఆఱ్ చిత్రంలోని "నాటు నాటు" పాటకు ఆస్కార్ అవార్డు పొందిన కీరవాణిని, పవన్ ప్రత్యేకంగా అభినందించారు.