LOADING...
Pawan kalayan : పవన్ కళ్యాణ్, లోకేష్ కొత్త సినిమా.. ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్!
పవన్ కళ్యాణ్, లోకేష్ కొత్త సినిమా.. ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్!

Pawan kalayan : పవన్ కళ్యాణ్, లోకేష్ కొత్త సినిమా.. ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2025
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే పాన్ ఇండియా డైరెక్టర్‌తో కొత్త సినిమా చేయనున్నారని వార్తలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఈ మూవీ తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ద్వారా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతుందని టాక్‌ వినిపిస్తోంది. పవన్ తన రాజకీయ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, సినిమాలపై కూడా దృష్టి పెట్టారు. ఇటీవలే ఆయన 'ఓజీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు, ఈ చిత్రం సుమారు 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించి, పవన్ కెరీర్‌లో ఊహించని హిట్‌గా నిలిచింది. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో పాటు మరో కొత్త సినిమా కూడా ఆయన హ్యాండిల్ చేస్తున్నారు.

Details

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నట్లు సమాచారం

ఇది తమిళంలో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ కేవీఎన్ సంస్థ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దర్శకత్వ బాధ్యతలు లోకేష్ కనకరాజ్ లేదా వినోద్ ఎవరికైనా వెళ్లే అవకాశాలు ఉన్నాయని చర్చలు పూర్తయ్యాయని వార్తలు ఉన్నాయి. అధికారిక ప్రకటన త్వరలో వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ దక్షిణాదిలో అగ్ర నటులతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోంది. ప్రస్తుతం దళపతి విజయ్‌తో 'జన నాయకన్', యష్‌తో 'టాక్సిక్', చిరంజీవితో బాబీ దర్శకత్వంలో సినిమా, ధ్రువ సర్జా హీరోగా 'కేడీ' వంటి చిత్రాలను నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌తో కొత్త సినిమా నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.