Page Loader
Ustaad Bhagat Singh : ఫుల్ స్పీడ్‌లో పవన్ కళ్యాణ్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్స్‌లోకి ఎంట్రీ!
ఫుల్ స్పీడ్‌లో పవన్ కళ్యాణ్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్స్‌లోకి ఎంట్రీ!

Ustaad Bhagat Singh : ఫుల్ స్పీడ్‌లో పవన్ కళ్యాణ్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్స్‌లోకి ఎంట్రీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 11, 2025
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం రాజకీయాల బిజీతో ఉన్నా, తాను ఒప్పుకున్న సినిమాలను త్వరతగతిన పూర్తి చేస్తున్నాడు. గతంలో ఎన్నో సినిమాలను వాయిదా వేయాల్సి వచ్చిన పవన్, ఇటీవల నిర్మాతలతో సమావేశమై ఈ ఏడాది ఆగస్టు నాటికి చిత్రాల షూటింగ్ పూర్తిచేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ వరుసగా షూటింగ్‌లలో పాల్గొంటూ సినిమాలను పూర్తి చేస్తూ వెళ్తున్నారు. మొదటగా, పవన్‌ 'హరిహర వీరమల్లు' సినిమా కోసం డేట్స్ కేటాయించి షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాకుండా, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "ఓజీ" సినిమాకు రెండు వారాల డేట్స్ ఇచ్చి షూటింగ్‌ను పూర్తి చేశారు.

Details

రెండు రోజుల క్రితమే షూటింగ్ పూర్తి

రెండు రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయినట్లు సమాచారం. ఇలా ఒక నెల వ్యవధిలో రెండు పెద్ద సినిమాల పనులను ముగించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్‌లో అడుగు పెట్టారు. ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతుండగా, హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదట ఈ సినిమా విజయ్ తలపతి నటించిన తమిళ చిత్రం 'తేరి'కి రీమేక్‌గా అనౌన్స్ చేశారు.

Details

పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉత్సాహం

అయితే ఆ కథ ఇప్పటికే హిందీలో రీమేక్ అయి ఫ్లాప్ కావడంతో, రాజకీయ పరిస్థితులు కూడా మారిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా కొత్త కథతో 'ఉస్తాద్ భగత్ సింగ్' తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్‌లో అధికారికంగా జాయిన్ అయ్యారు. చిత్ర బృందం దీనిని నిర్ధారిస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో హీరోయిన్ శ్రీలీల కూడా కనిపించటం విశేషం. ఈ ప్రకటనతో పవన్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.