Page Loader
Pawan Kalyan: కుమారుడితో స్వదేశానికి పవన్ కళ్యాణ్‌ దంపతులు.. వైరల్ అవుతున్న వీడియో
కుమారుడితో స్వదేశానికి పవన్ కళ్యాణ్‌ దంపతులు.. వైరల్ అవుతున్న వీడియో

Pawan Kalyan: కుమారుడితో స్వదేశానికి పవన్ కళ్యాణ్‌ దంపతులు.. వైరల్ అవుతున్న వీడియో

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2025
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈనెల 8న సింగపూర్‌లో ఓ స్కూల్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ సమాచారం అందిన వెంటనే హుటాహుటిన పవన్ కళ్యాణ్‌ సింగపూర్‌ వెళ్లారు. అక్కడి ఆస్పత్రిలో మార్క్‌కు నాలుగు రోజుల పాటు చికిత్స అందింది. ప్రమాద సమయంలో గొంతు, శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల్లోకి పొగ చొచ్చుకుపోవడంతో వైద్యులు బ్రాంకోస్కోపీ పద్ధతిలో చికిత్స చేశారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం,మార్క్ శంకర్ పూర్తిగా కోలుకోవడంతో పవన్ కళ్యాణ్‌ తన కుమారుడిని తీసుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్‌ తన కుమారుడిని ఎత్తుకుని ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన భార్య కూడా పక్కనే ఉన్నారు.

Details

ఊపిరి పీల్చుకున్న మెగా ఫ్యామిలీ

ఈ సమ్మర్‌లో సెలవుల నిమిత్తంగా పవన్‌ కుటుంబం సింగపూర్‌ వెళ్లింది. అదే సమయంలో మార్క్‌ శంకర్‌ను అక్కడి ఓ పాఠశాలలో సమ్మర్ కోర్సులో చేర్చారు. అయితే 8వ తేదీన పవన్ కళ్యాణ్‌ అరకు నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల్లో పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే ఆయన సోదరుడు చిరంజీవి దంపతులతో కలిసి సింగపూర్‌ బయలుదేరారు. ఈ ప్రమాదం నుంచి మార్క్‌ శంకర్‌ ప్రమాదం లేకుండా బయటపడటమే కాకుండా, పూర్తిగా కోలుకోవడంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఊపిరి పీల్చుకుంది. అభిమానులూ ఎంతో ఊరటతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమవుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కుమారుడితో ఇండియాకు వచ్చిన పవన్