LOADING...
అప్పుడు వాళ్ళు తిట్టారు, ఇప్పుడు వీళ్ళు తిడుతున్నారు: వైరల్ అవుతున్న రేణు దేశాయ్ కామెంట్స్ 
ఇన్స్ టా లో రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్

అప్పుడు వాళ్ళు తిట్టారు, ఇప్పుడు వీళ్ళు తిడుతున్నారు: వైరల్ అవుతున్న రేణు దేశాయ్ కామెంట్స్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 17, 2023
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కామెంట్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల బ్రో సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ పై అనేక విమర్శలు వచ్చాయి. ఈ విషయమై రేణు దేశాయ్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ తనను మోసం చేసారని చెబుతూనే పొలిటికల్ గా తన సపోర్ట్ పవన్ కళ్యాణ్ కే ఉంటుందని ఆమె తెలియజేసారు. దీంతో పవన్ కళ్యాణ్ ని విమర్శించే వాళ్ళంతా రేణు దేశాయ్ ని కూడా విమర్శించడం మొదలుపెట్టారు. తనపై వస్తున్న విమర్శలకు సమాధానంగా రేణు దేశాయ్ ఇన్స్ టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ తనను మోసం చేసాడని చెప్పినపుడు పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా ఉన్నవాళ్ళందరూ నన్ను తిట్టారు.

Details

నిజం మాట్లాడినందుకు నేను చెల్లించుకునే మూల్యం ఇదే 

ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా రాజకీయంలో మద్దతు తెలియజేస్తానని చెప్తుంటే, పవన్ విమర్శించే వారంతా నన్ను తిడుతున్నారు. ఈ రెండు సందర్భాల్లోనూ నేను నిజం చెప్పినందుకే నా మీద విమర్శలు వచ్చాయి. తిట్టండి, ఎన్నయినా తిట్టండి. నాకు తెలుసు.. ప్రేమలో పడినందుకు, నిజం మాట్లాడినందుకు నేను చెల్లిస్తున్న మూల్యం ఇదేనని అనుకుంటున్నాను. అనండి, ఎన్నయినా అనండి, నా మీద విమర్శలు మొదలుపెట్టండని రేణు దేశాయ్ కామెంట్స్ చేసారు. ప్రస్తుతం రేణు దేశాయ్ కామెంట్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

రేణు దేశాయ్ ఇన్స్ టా పోస్ట్