Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ జోడీ.. ఉస్తాద్ భగత్ సింగ్ నుండి క్రేజీ ఫస్ట్ స్టిల్ రిలీజ్!
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' హీరోగా నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) టాలీవుడ్‌లో భారీ అంచనాలను సృష్టిస్తోంది. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'దేఖ్ లేంగే సాలా' పాట ఇండస్ట్రీలో హల్ చల్ చేసింది. తాజాగా మేకర్స్ మరో బ్లాస్టింగ్ స్టిల్‌ను షేర్ చేశారు. స్టిల్‌లో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ టీం చేతులు పైకెత్తి ఫ్యాన్స్ కోసం ఉత్సాహభరితంగా 'హ్యాండ్ రైజ్' చేస్తున్నారు.
Details
త్వరలోనే మూవీ తేదీపై స్పష్టత
హరీష్ శంకర్ ప్రకటించిన ప్రకారం ఇది మొదలవుతుంది.. ఆనందంతో మీ చేతులను పైకెత్తి మా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం చీర్స్ చెప్పండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలిసి భారీ ఫీస్ట్‌తో త్వరలో మీ ముందుకు రాబోతున్నారు. ఈ స్టిల్ రిలీజ్ తర్వాత ఎలాంటి బ్లాస్ట్ సృష్టించబోతోందనే ఆత్రుత ఫ్యాన్స్‌లో నెలకొంది. ఇప్పటికే షూటింగ్, సంగీతం, ఫస్ట్ సింగిల్ బ్లాక్‌బస్టర్‌గా మారిన ఈ మూవీ 2026లో మాస్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.