
HHVM : పవన్ కళ్యాణ్ మానియా మొదలైంది.. రిలీజ్‌కి ముందు ప్రీమియర్ షోలు!
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. జూలై 24న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈచిత్రం ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు, ఇతర అప్డేట్లతో భారీ అంచనాలు నెలకొల్పింది. ఇప్పుడు రిలీజ్‌కి ముందే అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. తాజాగా చిత్ర నిర్మాత ఏఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూలై 24న సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. కానీ ఒక ప్రత్యేక ట్రీట్‌గా జూలై 23న రాత్రి 9 లేదా 9.30 గంటల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు ప్లాన్ చేశామని చెప్పారు.
Details
ప్రీమియర్ షోలపై మరింత ఆసక్తి
ఈ షోల ద్వారా సినిమాపై ఉన్న హైప్ మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. అభిమానులు ఈ వార్త విని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈచిత్రానికి జ్యోతికృష్ణ దర్శకుడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో వీరమల్లు అనే శక్తిమంతమైన యోధుడిగా కనిపించనున్నారు. ఈప్రాజెక్టును రెండు భాగాలుగా రూపొందిస్తుండగా, మొదటి భాగానికి 'హరిహర వీరమల్లు: పార్ట్ 1 - స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈభారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఉత్కంఠ నెలకొన్న తరుణంలో ప్రీమియర్ షోలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.