
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
ఈ వార్తాకథనం ఏంటి
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి ఉత్సాహాన్ని కలిగించే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇటీవల విడుదలైన "They Call Him OG" సినిమా మంచి విజయాన్ని సాధించడంతో, ఇప్పుడు అభిమానుల దృష్టి పూర్తిగా ఆయన తదుపరి ప్రాజెక్ట్ "ఉస్తాద్ భగత్ సింగ్" మీదే ఉంది. ఈ చిత్రం 2026 మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ అవుతుందన్నవార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే, తాజా ఇంటర్వ్యూలో నిర్మాత రవి కిరణ్ ఆ వార్తపై స్పష్టత ఇచ్చారు.
వివరాలు
అధికారిక రిలీజ్ డేట్ ప్రకటించని నిర్మాతలు
రవి కిరణ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ తన భాగం షూటింగ్ పూర్తిచేశారు. దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్న హరీష్ శంకర్ రేపటి నుండి కొత్త షెడ్యూల్‌ను ప్రారంభిస్తున్నారు. ఇంకా సుమారు 20-25 రోజుల షూటింగ్ మిగిలి ఉందని చెప్పారు.ఆ తర్వాత సినిమా నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ప్రేక్షకులకు అనుకూలమైన రిలీజ్ డేట్‌ను చూసి సినిమా విడుదల చేస్తామని రవి కిరణ్ స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో సమ్మర్ 2026లో సినిమా థియేటర్లలోకి రావచ్చన్న చర్చలు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే, నిర్మాతలు ఇంకా అధికారిక రిలీజ్ డేట్ ప్రకటించలేదు.
వివరాలు
మాస్ ఫ్యాన్స్ కి పండగే
ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరూ మళ్లీ కలుస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఈ ముగ్గురు కాంబినేషన్‌లో సినిమా వస్తుంది అంటే మరోసారి మాస్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. చిత్రంలో రాశీ ఖన్నా,శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిపింది. ఈ ఇద్దరూ టాలీవుడ్‌లో మంచి క్రేజ్ కలిగిన నటీమణులు.బ్యూటీతో పాటు పెర్ఫామెన్స్ పరంగా కూడా ఈ చిత్రానికి వారు కీలకంగా మారనున్నారు.
వివరాలు
పటిష్టంగా మారిన పవన్ కళ్యాణ్ స్టార్డమ్
ఇటీవల విడుదలైన OG మూవీ విజయంతో పవన్ కళ్యాణ్ స్టార్డమ్ మరింత పటిష్టంగా మారింది. దీని ప్రభావం 'ఉస్తాద్ భగత్ సింగ్' పై గణనీయంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పాత్రను పవర్, స్టైల్, మాస్ యాంగిల్ కలిగిన ప్రత్యేకమైన క్యారెక్టర్‌గా రూపొందించినట్లు సమాచారం. ఈ సినిమాతో పవన్ మరో పెద్ద హిట్‌ను సాధించనుండబోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.