
Allu Aravind: పవన్ కళ్యాణ్ ఈ సినిమాను చూడాల్సిందే.. అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
సనాతన ధర్మంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఉన్న అవగాహన ఎంతగానో విశేషమని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు. తన పరిచయంలోని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఇతరులందరిలోనూ పవన్ కళ్యాణ్‌కి సనాతన ధర్మం గురించి ఉన్న లోతైన అవగాహన మరెవరికీ లేదని అన్నారు. ఆయన ఈ అంశంపై మాట్లాడితే అందరూ ఆశ్చర్యచకితులవుతారని అన్నారు. శ్రీమహావిష్ణువు నరసింహావతారాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన యానిమేటెడ్ చిత్రం 'మహావతార్ నరసింహ'ను పవన్ తప్పకుండా చూడాలని, దానిపై మాట్లాడాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈచిత్రం విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో అల్లు అరవింద్, దర్శకుడు అశ్విన్ కుమార్, నటుడు,రచయిత తనికెళ్ల భరణి, గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు పాల్గొన్నారు.
Details
హోంబలే ఫిల్మ్స్‌తో నాకు మంచి అనుబంధం
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''హోంబలే ఫిల్మ్స్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నిర్మాత విజయ్ ఫోన్ చేసి, 'మహావతార్ నరసింహ' చిత్రాన్ని తెలుగులో మీరు విడుదల చేయాలని అడిగారు. ఆ తరువాత ఎలాంటి చర్చలు జరగలేదు. వెంటనే ఒప్పుకున్నాను. రిలీజ్ రోజు ఉదయం షోకు వచ్చిన రెస్పాన్స్‌ను బట్టి అదే రోజు సాయంత్రానికి కొన్ని షోలను పెంచాం. తరువాత రోజుల్లో మరిన్ని స్క్రీన్స్ జోడించాం. హైదరాబాద్‌లోని ఓ మల్టీప్లెక్స్‌లో 200 మంది స్వాములు కలిసి ఈ చిత్రాన్ని చూశారు. ఈ సినిమాకు ప్రత్యేకంగా ప్రమోషన్లు అవసరం లేదనిపించింది. దర్శకుడు అశ్విన్ కుమార్ ఎంతో శ్రమించారు.2021లోనే ఈ సినిమాకు బీజం పడింది. ఎన్నోసవాళ్లు ఎదుర్కొని పట్టుదలతో ఈ స్థాయికి తీసుకువచ్చారని పేర్కొన్నారు.