ఒక్క పోస్టు కూడా అప్లోడ్ చేయకుండానే అరుదైన రికార్డు అందుకున్న పవన్ కళ్యాణ్
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్స్ టాగ్రామ్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఇన్స్ టాలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు పవన్ ఒక్క పోస్ట్ కూడా చేయలేదు.
అయినా కూడా ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం పవన్ ఫాలోవర్ల సంఖ్య 2మిలియన్లకు చేరింది.
పవన్ లాంటి సెలెబ్రిటీలకు ఇంత మాత్రం ఫాలోయింగ్ ఏర్పడటం సహజమే అయినా, ఒక్కపోస్టు కూడా వేయకుండా 2మిలియన్ల ఫాలోవర్లను తెచ్చుకోవడం రికార్డుగా మారింది.
ఇన్స్ టా గ్రామ్ ఫాలోవర్స్ అంతా పవన్ పెట్టే పోస్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి పవన్ పెట్టే మొదటి పోస్ట్ ఏమై ఉంటుందో చూడాలి.
Details
రాజకీయానికి సంబంధించిన పోస్టుల కోసమే ఇన్స్ టా అకౌంట్
ఇన్స్ టాగ్రామ్ లో పవన్ ప్రొఫైల్ లో ఎలుగెత్తు, ఎదిరించు, ఎన్నుకో, జై హింద్ అనే కొటేషన్ కనిపిస్తుంది. అంటే ఇన్స్ టాలో రాజకీయానికి సంబంధించిన పోస్టులే ఉంటాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ట్విట్టర్ లో కూడా కేవలం రాజకీయానికి సంబంధచిన పోస్టులే పెడతారు పవన్ కళ్యాణ్.
అదలా ఉంచితే, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్రో, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నారు. వీటిల్లో బ్రో సినిమా, జులై 28న విడుదలకు సిద్ధమవుతోంది.
ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఓజీ సినిమాను సాహో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తుండగా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను హరీష్ శంకర్ రూపొందిస్తున్నారు.