LOADING...
Hari hara veera mallu: 'హరిహర వీరమల్లు' రెమ్యునేషన్‌ను వెనక్కి ఇచ్చేసిన పవన్ కళ్యాణ్
'హరిహర వీరమల్లు' రెమ్యునేషన్‌ను వెనక్కి ఇచ్చేసిన పవన్ కళ్యాణ్

Hari hara veera mallu: 'హరిహర వీరమల్లు' రెమ్యునేషన్‌ను వెనక్కి ఇచ్చేసిన పవన్ కళ్యాణ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 04, 2025
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తాను ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్‌ యాక్షన్‌ మూవీ 'హరిహర వీరమల్లు' కోసం ముందుగానే తీసుకున్న పారితోషికాన్ని నిర్మాతకు తిరిగి ఇచ్చేయడం ద్వారా చిత్ర పరిశ్రమలో ఆదర్శంగా నిలిచారు. ఈ సినిమా 2020లో అధికారికంగా ప్రారంభం తకాగా, కరోనా, ఇతర కారణాలతో చిత్రీకరణ అనేక మార్లు నిలిచిపోయింది. క్రిష్‌ దర్శకత్వంలో మెగాఫోన్ పట్టిన ఈ చిత్రం మధ్యలో కొంతకాలం నిలిచిపోయింది. అనంతరం ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టగా షూటింగ్ చివరకు పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర పనుల్లో ఉంది. విడుదల తేదీగా జూన్ 12ని నిర్ణయించారు.

Details

పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు

ఈ మధ్యకాలంలో రాజకీయంగా మరింత బిజీ అయిన పవన్‌ కళ్యాణ్... ముఖ్యంగా ఎన్నికల తరువాత ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ప్రజాసేవపై దృష్టి పెట్టారు. దీంతో షూటింగ్‌లో ఆలస్యం జరిగి, భారీగా ఖర్చులుపెరిగాయి. ఈ విషయాన్ని గమనించిన పవన్.. తన పారితోషికాన్ని పూర్తిగా వెనక్కి ఇచ్చేయడం నిర్మాత ఏఎం రత్నంపై ఉన్న గౌరవానికీ, తన నైతిక విలువలకూ నిదర్శనంగా నిలిచింది. ఇప్పటికే సినిమాకు సంబంధించి షూటింగ్ మొత్తం ముగియగా, పవన్‌ కల్యాణ్ ఈ నిర్ణయంతో సినీ పరిశ్రమలో మంచి సందేశం ఇచ్చారు. నిర్మాతకు మద్దతుగా నిలవడం, తన పారితోషికాన్ని వదలడం పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఇలాంటి తీరు వల్లే పవన్‌పై అభిమానుల అభిమానంతో పాటు చిత్రపరిశ్రమలోనూ ప్రత్యేక గౌరవం కొనసాగుతోంది.