
HHVM : పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ ప్రభావం.. హరిహర వీరమల్లు రిలీజ్ వాయిదా?
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ డ్రామా 'హరిహర వీరమల్లు' చివరి దశ పనుల్లో ఉంది.
యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో, మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్లు సినిమాపై భారీ బజ్‌ను సృష్టించాయి. ఈ సినిమాను మొదటగా ఈ ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించారు.
కానీ అప్పటివరకు షూటింగ్ పూర్తికాకపోవడంతో రిలీజ్‌ను వాయిదా వేశారు. అనంతరం మే 9 తేదీని కొత్త విడుదల తేదీగా ప్రకటించారు.
Details
త్వరలోనే రిలీజ్ తేదీపై స్పష్టత
తాజా సమాచారం ప్రకారం మే 9న కూడా ఈ చిత్రం విడుదల కావడం కష్టమేనని తెలుస్తోంది. ఇప్పటికీ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట.
పవన్ కళ్యాణ్ రాజకీయ బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్ పూర్తికావడం ఆలస్యం అవుతోంది. ఇప్పటికే పలు సార్లు రిలీజ్ వాయిదా పడ్డ 'హరిహర వీరమల్లు' చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో మేకర్స్‌కే స్పష్టత లేకపోవచ్చని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి తుదిరిలీజ్ తేదీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది.