
పవన్ కళ్యాణ్ ఓజీ టెస్ట్ షూట్ కోసం భారీగా ఖర్చు, పవన్ అభిమానుల్లో అందోళన
ఈ వార్తాకథనం ఏంటి
హరిహర వీరమల్లు, వినోదయ సీతమ్ రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా చేస్తున్నాడు.
ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా పనులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా టెస్ట్ షూట్ జరిగిందని అంటున్నారు.
అయితే ఆ టెస్ట్ షూట్ కి అయిన ఖర్చు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజులపాటు జరిగిన టెస్ట్ షూట్ కోసం దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు అయిందని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పవర్ స్టార్ అభిమానులు అవాక్కవుతున్నారు.
Details
జపాన్ దేశానికి కథకూ లింక్
సినిమా షూటింగ్ పనులు మొదలవకముందే కోటి రూపాయలకు పైగా ఖర్చు అయ్యిందంటే ఇక మొదలైతే ఎంత ఖర్చవుతుందో అనుకుని ఆశ్చర్యపోతున్నారు. ఓజీ సినిమాలో గ్యాంగ్ స్టార్ గా పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు.
ఇందులో జపాన్ దేశం నేపథ్యంలో కథ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఓజీ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో జపాన్ భాషలో కొన్ని వాక్యాలు కనిపించడంతో, ఈ సినిమా కథకు జపాన్ కు ఏదో సంబంధం ఉందని చెబుతున్నారు.
ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా కనిపించనిందని వినిపిస్తోంది.
నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్, శర్వానంద్ హీరోగా రిలీజ్ అయిన శ్రీకారం సినిమాలో నటించింది ప్రియాంక మోహన్. ఓజీ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.