
OG: పవన్ కళ్యాణ్ 'ఓజీ' రిలీజ్ డేట్ ఖరారు.. ఆనందంలో ఫ్యాన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ 'ఓజీ'పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని ఎదురుచూస్తున్న వారికోసం చిత్ర బృందం క్రేజీ అప్‌డేట్‌ను వెల్లడించింది.
దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
'ఫైరింగ్ వరల్డ్ 25 సెప్టెంబర్ 25' అనే ప్రకటనతో ఈ వార్తను అభిమానులతో పంచుకుంది. ఈ అప్‌డేట్‌తో పవన్ అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను వరుసగా పూర్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు.
Details
దసరా కానుకగా రిలీజ్
ఇటీవల 'హరి హర వీరమల్లు' చిత్రీకరణను పూర్తిచేసిన పవన్, ఇప్పుడు పూర్తి స్థాయిలో 'ఓజీ'పై దృష్టి సారించారు. షూటింగ్ మళ్లీ ప్రారంభమైనట్లు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది.
ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ యాక్టివ్‌గా పనిచేస్తోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ నేపథ్యంలో సెప్టెంబరు 25న 'ఓజీ' విడుదల కాబోతుండటంతో పవన్ అభిమానులకు ఇది నిజంగా దసరా బంపర్ గిఫ్ట్ అని చెప్పవచ్చు.