Page Loader
బ్రో: తండ్రి సినిమా చూడడానికి వచ్చిన అకిరా నందన్; వీడియో వైరల్ 
బ్రో సినిమా చూడడానికి వచ్చిన అకిరా నందన్

బ్రో: తండ్రి సినిమా చూడడానికి వచ్చిన అకిరా నందన్; వీడియో వైరల్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 28, 2023
05:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉత్సాహాన్ని అందిస్తూ బ్రో సినిమా ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే. బ్రో సినిమాకు టిక్కెట్లు బుకింగ్స్ చేసుకున్న వాళ్ళందరూ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. అయితే బ్రో సినిమా చూడడానికి హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ కి పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ వచ్చారు. బ్రో ప్రింట్ తో ఉన్న టీ షర్ట్ ధరించి ఖరీదైన కారులో థియేటర్ ముందు దిగారు అకిరా నందన్. ప్రస్తుతం ఈ విజువల్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అదలా ఉంచితే, అకిరా నందన్ హీరోగా రామ్ చరణ్ నిర్మాణంలో సినిమా ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. మరేం జరుగుతుందో చూడాలి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బ్రో సినిమా చూడడానికి వచ్చిన అకిరా నందన్