Page Loader
ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్: ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది 

ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్: ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది 

వ్రాసిన వారు Sriram Pranateja
May 11, 2023
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడుఎప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ విడుదలైంది. 42సెకన్ల వీడియోలో పవన్ కళ్యాణ్ అభిమానులకు కావాల్సినవన్నీ ఉన్నాయి. భగవద్గీత శ్లోకంతో మొదలైన గ్లింప్స్, పవర్ ఫుల్ మాస్ డైలాగ్ తో పూర్తయ్యింది. పవన్ కళ్యాణ్ తనను తాను పరిచయం చేసుకునే డైలాగ్ పవన్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. లుంగీ కట్టుకుని, బెల్టుకు పిస్టల్ తగిలించుకుని జీపులోంచి దూకే సీన్ గబ్బర్ సింగ్ సినిమాలోని పవన్ కళ్యాణ్ ని గుర్తు చేస్తుంది. ఇక చివరగా, ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోతుంది అనే డైలాగ్ తో గ్లింప్స్ పూర్తయ్యింది.

Details

అదిరిపోయిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం 

ఈ గ్లింప్స్ వీడియోకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం అదిరిపోయిందనే చెప్పాలి. ఇన్ని రోజులు పూర్తిస్థాయి పవన్ కళ్యాణ్ ను చూడలేకపోయామని ఆలోచించే వారికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆ లోటును తీర్చేలా కనిపిస్తోంది. ఒక సగటు పవన్ కళ్యాణ్ అభిమాని, పవన్ కళ్యాణ్ ను ఎలా చూడాలని కోరుకుంటాడో అలా చూపించే ప్రయత్నం దర్శకుడు చేసాడని తెలుస్తోంది. ఈ గ్లింప్స్ తో పూనకాలు లోడ్ అయ్యాయని చెప్పవచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను నవీన్ యేర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తోంది. అయానక బోస్ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ సినిమాకు కె దశరథ్ స్క్రీన్ ప్లే సమకూర్చారు.