
OG: ఓజీ సెట్స్‌లో పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో ఎంతటి బిజీగా ఉన్నా.. సినిమాల మీద తన ఫోకస్‌ను మాత్రం తగ్గించడం లేదు. గతంలో ఆయన ప్రారంభించిన సినిమాలను ఇప్పుడు పూర్తిచేస్తూ, విడుదలకు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఇప్పటికే 'హరిహర వీరమల్లు' చిత్రం షూటింగ్‌ను పూర్తిచేశారు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా సినిమా వచ్చే నెల 12వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ముంబైలో 'ఓజీ' చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మాణంలో 'సాహో' ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
Details
ఫిదా అవుతున్న ఫ్యాన్స్
ఆ వీడియోలో పవన్ కళ్యాణ్‌ను బౌన్సర్లు సెక్యూరిటీగా తీసుకెళ్లి కార్‌లోకి ఎక్కిస్తున్న సన్నివేశం కనిపించింది. అందులో ఆయన ధరించిన వింటేజ్ బెల్‌బాటమ్ ప్యాంట్ లుక్‌కి నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ స్టైల్‌ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాను మేకర్స్ వీలైనంత తొందరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నింటిలో ఈ 'ఓజీ' సినిమాపై అభిమానుల్లో అత్యధిక ఆసక్తి నెలకొంది. దర్శకుడు సుజిత్ పవన్‌ను స్టైలిష్‌గా చూపించే విధానం, చిత్ర కథానిక కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.