Page Loader
పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా టైటిల్ చెప్పేసారు బ్రో; ఒకేసారి ముడు అప్డేట్లు రిలీజ్
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా టైటిల్ రివీల్

పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా టైటిల్ చెప్పేసారు బ్రో; ఒకేసారి ముడు అప్డేట్లు రిలీజ్

వ్రాసిన వారు Sriram Pranateja
May 18, 2023
06:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్ర టైటిల్ ఇంతకుముందే రిలీజ్ అయ్యింది. అందరూ ఊహించినట్టుగానే ఎన్నో రోజుల నుండి ప్రచారంలో ఉన్నట్టుగానే ఈ సినిమాకు బ్రో అనే టైటిల్ ను పెట్టారు. టైటిల్ రివీల్ చేయడంతో పాటు మోషన్ పోస్టర్ వీడియోను రిలీజ్ చేసారు. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ చాలా స్టైలిష్ గా ఉంది. థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. తమిళంలో విజయం సాధించిన వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్ గా బ్రో తెరకెక్కుతోంది. ఈ సినిమాను సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నాడు. బ్రో సినిమాను జులై 28వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టైటిల్ రివీల్ చేస్తూ ట్వీట్ వేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ