Anna Lezhneva : ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన పవర్ స్టార్ భార్య..10 నిమిషాల్లో 21 వేల ఫాలోవర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ జీవిత భాగస్వామి అయిన అన్నా లెజినోవా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ప్రజా దృష్టికి దూరంగా ఉండే ఆమె..తాజాగా సోషల్ మీడియా ప్రపంచంలోకి ప్రవేశించి, "అన్నా. కొనిదెల" అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో తన అధికారిక ఖాతాను ప్రారంభించారు. ఖాతా ప్రారంభించిన వెంటనే ఆమె భర్త పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఒక ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటో వెంటనే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. ఖాతా ప్రారంభించిన పది నిమిషాలలోనే 21 వేలకుపైగా ఫాలోవర్లు చేరారు.
వివరాలు
అభిమానుల సందడి
అన్నా లెజినోవా రష్యాకు చెందిన మోడల్, నటి. ఆమె పవన్‌తో కలిసి 2013 సెప్టెంబర్ 30న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి 2017లో మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు జన్మించాడు. అన్నా లెజినోవా భక్తి పరురాలిగా కూడా పేరు పొందారు. పవన్ కళ్యాణ్ మాదిరిగానే ఆమె హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని తన జీవితంలో పాటిస్తున్నారు. ఇటీవల తిరుమలలో తలనీలాలు సమర్పించడం ద్వారా ఆమె ఆధ్యాత్మిక విశ్వాసం మరింతగా బయటపడింది. ఇప్పటి వరకు ప్రజా జీవితం నుండి దూరంగా ఉన్న అన్నా, ఇప్పుడు సోషల్ మీడియాలోకి రావడం అభిమానులకు ఒక ప్రత్యేకంగా మారింది. ఇకపై ఆమె సోషల్ మీడియాలో మరిన్ని పోస్టులు పంచుకుంటారా అనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరుగుతోంది.