
Hari Hara Veeramallu: పవన్ మేనియా స్టార్ట్.. 'హరిహర వీరమల్లు' ట్రైలర్ థియోటర్లలో రిలీజ్!
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఎట్టకేలకు విడుదల కానుంది. ఇప్పటికే పలు వాయిదాల నడుమ సినిమాకు విడుదల తేదీని జూలై 24గా ఖరారు చేయగా, ఇప్పుడు ట్రైలర్‌ను జూలై 3న ఉదయం 11:10కి విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు సాధారణంగా యూట్యూబ్‌లో ట్రైలర్లు రిలీజ్ చేస్తుండగా ఈసారి మాత్రం మేకర్స్ ఓ స్పెషల్ ప్లాన్ చేశారు. 'హరిహర వీరమల్లు' ట్రైలర్‌ను ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లోని 29 థియేటర్లలో థియేట్రికల్‌గా రిలీజ్ చేయనున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, ఒంగోలు, చిత్తూరు వంటి ప్రధాన నగరాల్లో ఈ విడుదల జరగనుంది.
Details
జూన్ 3న థియేటర్లలో రిలీజ్
ట్రైలర్ విడుదలకు సంబంధించి పవన్ అభిమానులు ఇప్పటికే సిద్ధమయ్యారు. థియేటర్ల వద్ద కట్ అవుట్లు, ఫ్లెక్సీలు, డీజే డాన్స్‌లు, బాణాసంచా ఇలా పండుగ వాతావరణాన్ని సృష్టించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాబీ డియోల్ ప్రధాన ప్రతినాయకుడిగా తెరపై అలరించనున్నాడు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం, ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం జూలై 3న థియేటర్లలోనే ట్రైలర్ చూసే ప్రత్యేక అనుభవం సిద్ధమైంది. సినిమా విడుదలకు ముందు ఈ ట్రైలర్ మరింత హైప్‌ను తెచ్చిపెట్టనుంది.