LOADING...
PEDDI : 'పెద్ది' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే? 
'పెద్ది' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?

PEDDI : 'పెద్ది' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2025
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా, ప్రతిభావంతుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పెద్ది' భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో, సుకుమార్‌ రైటింగ్స్‌ సహకారంతో వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై సతీష్‌ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్‌ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా రామ్‌చరణ్‌ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవబోతుందని టీమ్‌ విశ్వసిస్తోంది. రామ్‌చరణ్‌ సరసన బాలీవుడ్‌ అందాల తార జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో విడుదలైన 'పెద్ది' ఫస్ట్‌ గ్లిమ్స్‌ ఎంతటి సెన్సేషన్‌ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చే ఏడాది మార్చి 27న, సమ్మర్‌ సీజన్‌ కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్‌ సిద్ధమవుతున్నారు.

Details

నవంబర్ 6న రిలీజ్

ఇక షూటింగ్‌ విషయానికి వస్తే.. సినిమా చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. ఇటీవల శ్రీలంకలో భారీ యాక్షన్‌ సన్నివేశాలను పూర్తి చేసిన బుచ్చిబాబు, ఇప్పుడు తదుపరి షెడ్యూల్‌కు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఎఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. పెద్ది ఫస్ట్‌ సింగిల్‌ ఎప్పుడు విడుదలవుతుందా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దీనిపై స్పష్టత వచ్చింది. ఈ నెల 6వ తేదీన (గురువారం) తొలి సింగిల్‌ విడుదల కానుంది. ఇప్పటికే పాటను సిద్ధం చేసి, హీరో రామ్‌చరణ్‌కు వినిపించి ఆయన నుంచి ఆమోదం పొందారు. తాజాగా హైదరాబాద్‌లో ఎఆర్‌ రెహమాన్‌ నిర్వహించనున్న మ్యూజిక్‌ కన్సర్ట్‌లో 'పెద్ది' ఫస్ట్‌ సింగిల్‌ను లైవ్‌ పెర్ఫార్మెన్స్‌ రూపంలో ఆవిష్కరించనున్నట్టు సమాచారం.