PEDDI: విజయవాడలో ఘనంగా 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్.. అభిమానుల కోసం 'మస్సా మస్సా' వీడియో సాంగ్ విడుదల!
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది' ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం విజయవాడలో చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సానా, సంగీత దర్శకుడు ఏఆర్.రెహమాన్, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశనేని విశ్వనాథ్ హాజరయ్యారు. ఈ వేడుకలో భాగంగా చిత్రబృందం 'మస్సా మస్సా' అనే పవర్‌ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఆడియో రూపంలో సంగీత ప్రియులను ఆకట్టుకున్న ఈ పాట, ఇప్పుడు మేకింగ్ విజువల్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
వివరాలు
హీరోయిన్‌గా జాన్వీ కపూర్
వీడియో సాంగ్‌లో సినిమా కోసం రామ్ చరణ్ చేసిన కఠిన శ్రమను స్పష్టంగా చూపించారు. పాత్రకు అనుగుణంగా తన శరీరాకృతిని మార్చుకోవడం, యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోవడం, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం వంటి అంశాలను మేకింగ్ విజువల్స్‌లో ఆవిష్కరించారు. చరణ్ అంకితభావం, హార్డ్‌వర్క్ చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తూ, "మైండ్ బ్లోయింగ్ డెడికేషన్" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ హై-ఎనర్జీ ట్రాక్‌కు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంగా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న 'పెద్ది' చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.