
Peddi: దివ్యేందు బర్త్‌డే కానుకగా 'పెద్ది' నుండి 'రామ్ బుజ్జి' క్యారెక్టర్ పోస్టర్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'పెద్ది'.
ఇది గ్రామీణ నేపథ్యంతో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామా కావడం విశేషం.
ఈ చిత్రం నుంచి తాజాగా ఓ ఆసక్తికరమైన సమాచారాన్ని చిత్రబృందం విడుదల చేసింది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, 'మిర్జాపూర్' వెబ్ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న దివ్యేందు శర్మ, ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.
వివరాలు
దివ్యేందు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
దివ్యేందు పుట్టినరోజు సందర్భంగా, ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ పోస్టర్లో ఆయన చేతిలో క్రికెట్ బంతిని తిప్పుతూ, సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు.
ఆయన పాత్ర పేరు 'రామ్ బుజ్జి' అని మేకర్స్ వెల్లడించారు.
ఈ శక్తివంతమైన పాత్రను దర్శకుడు బుచ్చిబాబు సానా ఎలాంటి మలిచారో చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
'మిర్జాపూర్'లో మున్నా భాయ్ పాత్రతో తన నటనకు సర్వత్రా ప్రశంసలు అందుకున్న దివ్యేందు, ఇప్పుడు రామ్ చరణ్ చిత్రంలో ఎలా మెరిస్తారోనని సినీప్రేమికులు ఎదురుచూస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
Happiest Birthday To Our RAM BUJJI @Divyenndu 🔥#PEDDI pic.twitter.com/uMTcnxPgWU
— PEDDI (@PeddiMovieOffl) June 19, 2025
వివరాలు
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్
'పెద్ది' చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇందులో కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన మెగాస్టార్ శివ రాజ్‌కుమార్, తెలుగులో తన ప్రత్యేకతను చాటుకున్న నటుడు జగపతి బాబు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
'పెద్ది' సినిమాను పాన్ ఇండియా స్థాయిలో, బహుభాషా చిత్రంగా రూపొందిస్తున్నారు.
ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే స్పష్టం చేశారు.
రామ్ చరణ్-బుచ్చిబాబు కలయికలో వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఇప్పుడు దివ్యేందు శర్మ పాత్రను పరిచయం చేయడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.