LOADING...
Peddi: బుచ్చిబాబు సానా బిగ్ ప్లాన్.. ఏకంగా పీఎం ఆఫీసులో 'పెద్ది' షూటింగ్..!
బుచ్చిబాబు సానా బిగ్ ప్లాన్.. ఏకంగా పీఎం ఆఫీసులో 'పెద్ది' షూటింగ్..!

Peddi: బుచ్చిబాబు సానా బిగ్ ప్లాన్.. ఏకంగా పీఎం ఆఫీసులో 'పెద్ది' షూటింగ్..!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కొత్త సినిమా'పెద్ది'షూటింగ్‌లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు పాటలు ప్రేక్షకుల్లో భారీఅంచనాలు నెలకొల్పాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌తో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. టీజర్‌లో కనిపించిన క్రికెట్ షాట్,అలాగే 'చికిరి చికిరి' పాటలోని స్టెప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. మార్చి 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో,చిత్ర బృందం షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసే పనిలో ఉంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది.

వివరాలు 

ఇండియా గేట్ వద్ద కీలక సన్నివేశాలు 

ఢిల్లీ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ రాజధానిలో భారీ ఏర్పాట్లు చేసింది. అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంతో పాటు ఏపీ భవన్, పార్లమెంట్ పరిసర ప్రాంతాలు, ఇండియా గేట్ వద్ద కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ప్రధాని కార్యాలయం పరిధిలోనూ, ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ప్రధానమంత్రి సంగ్రహాలయం)లో కూడా షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం, లైబ్రరీని సందర్శించి అక్కడి అధికారులను కలిసిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 'RRR' సినిమా తర్వాత రామ్ చరణ్‌కు ఉత్తర భారతంలో భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడిన విషయం తెలిసిందే.

వివరాలు 

 'పెద్ది'పై ఉన్న హైప్

ఇప్పుడు ఢిల్లీలో 'పెద్ది' షూటింగ్ కొనసాగుతుండటంతో, చరణ్‌ను ఒక్కసారైనా చూడాలనే ఉత్సాహంతో పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకుంటున్నారు. అభిమానులే కాదు, అక్కడి పోలీస్ సిబ్బంది కూడా ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించడంతో ఆ దృశ్యాలు నెట్టింట విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలో షూటింగ్ జరగడం, అరుణ్ జైట్లీ స్టేడియంలో కీలక సన్నివేశాల చిత్రీకరణ, ప్రధాని కార్యాలయం పరిధిలో షూట్ వంటి అంశాలను గమనిస్తే, దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను ఏదో పెద్ద ఆలోచనతోనే తెరకెక్కిస్తున్నాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో చిత్రీకరిస్తున్న సన్నివేశాలు 'పెద్ది'పై ఉన్న హైప్‌ను మరింత పెంచుతున్నాయి. మొత్తంగా రామ్ చరణ్ కెరీర్‌లో మరో భారీ చిత్రంగా నిలవబోయే 'పెద్ది'పై అంచనాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఢిల్లీలో 'పెద్ది' హడావుడి

Advertisement