Nagarjuna: అక్కినేని నాగార్జునను అరెస్టు చేయాలంటూ పిటిషన్
బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి అయిన విషయం తెలిసిందే. ఈ షో విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఈ షోపై ఎన్ని విమర్శలు, అభ్యంతరాలు వచ్చినా బిగ్ బాస్(BIG BOSS) నిర్వహుకులు షోను నడిపిస్తూనే వచ్చారు. ఇక ఈ సీజన్ ఎండింగ్ దాడులు, గొడవలతో రచ్చరచ్చగా మారింది. ఈ కారణంతో ఆ దాడికి కారణమైన బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) , అతడి ఫ్యాన్స్ పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున(Nagarjuna)పై కూడా అడ్వకేట్ అరుణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
ఈ పిటిషన్ పై స్పందించని బిగ్ బాస్ నిర్వాహకులు
వంద రోజుల పాటు కొందరు వ్యక్తులను అక్రమంగా నిర్బంధించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ వేసినట్లు తెలిసింది. ఇందులో బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారిని సైతం విచారించాలని పిటిషన్‌లో ఆయన కోరారు. ఇక ఆర్టీసీతో సహా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేయడం వెనుక ఉన్న కుట్రను బయటకు తీయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ షోకి హోస్టుగా వ్యవహరిస్తున్న నాగర్జునని తక్షణమే అరెస్టు చేయాలన్నారు. అయితే ఈ పిటిషన్‌పై నాగార్జున, బిగ్ బాస్ నిర్వాహకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.