Page Loader
Salaar: స‌లార్ ఫస్ట్ టికెట్ కొనుగోలు చేసిన రాజమౌళి 
Salaar: స‌లార్ ఫస్ట్ టికెట్ కొనుగోలు చేసిన రాజమౌళి

Salaar: స‌లార్ ఫస్ట్ టికెట్ కొనుగోలు చేసిన రాజమౌళి 

వ్రాసిన వారు Stalin
Dec 16, 2023
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌- పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రం స‌లార్ పార్ట్-1: సీజ్ ఫైర్. ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా డిసెంబ‌ర్ 22న విడుదల కానున్న నేపథ్యంలో టికెట్ల బుకింగ్స్‌ను శనివారం ఓపెన్ చేశారు. ఈ క్రమంలో ఈ సినిమా తొలి టిక్కెట్‌ను దిగ్గజ దర్శకుడు రాజమౌళి కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో రాజమౌళి టికెట్‌ను బుక్ చేసుకున్నారు. రూ.10,116కు రాజమౌళి టికెట్ కొనడంతో ఈ అంశం వైరల్‌గా మారింది. ఇక ఈ మూవీ డిస్ట్రిబ్యూటింగ్ విషయానికి వస్తే.. నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్