Page Loader
Pindam Teaser : పిండం టీజర్ రిలీజ్.. ఆత్మలు, పిండం నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా 
పిండం టీజర్ రిలీజ్

Pindam Teaser : పిండం టీజర్ రిలీజ్.. ఆత్మలు, పిండం నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 30, 2023
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్లో మరో హార్రర్ చిత్రం పిండం టీజర్ వచ్చేసింది. అయితే ఎప్పుడూ లేనంతగా భయానకం ప్రదర్శించే సినిమా పిండం అంటూ ఇప్పటికే ఆ చిత్ర నిర్మాణ బృందం పదే పదే ప్రస్తావిస్తోంది. ఈ మేరకు మూవీ టీజర్ ఇవాళ విడుదలైంది. ముందస్తుగా చెప్పినట్లే సినిమా భయపెట్టేందుకు ప్రయత్నించింది. ఒకరికి ఒకరు సినిమా ఫేమ్ శ్రీరామ్, ఖుషీ రవి, ఈశ్వరి రావు, అవసరాల శ్రీనివాస్ తారగణంతో రూపొందిన పిండం, ఆత్మల కథ నేపథ్యమున్న సినిమా. ఈ సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహిస్తుండగా, కాలాహి మీడియా బ్యానర్ కింద యశ్వంత్ దగ్గుమాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నవంబర్ నెలలో విడుదల కానున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తైంది.

details

స్కేరీయెస్ట్ ఫిల్మ్ ఎవర్ అంటూ భయపెడుతున్న పిండం

ఈ నేపథ్యంలోనే టీజర్ చూస్తే, ఓ మారుమూల ఇల్లు, అందులో ఓ కుటుంబం, వాళ్లను భయపెట్టే ఆత్మ. ఇదే ఈ సినిమా లైనప్. స్కేరీయెస్ట్ ఫిల్మ్ ఎవర్ (Scariest Movie Ever) అంటూ విడుదలకు ముందే టీజర్ ద్వారా స్పష్టమైంది. ట్యాగ్ లైన్ కు తగ్గట్లు సినిమా ఉంటుందా లేదా త్వరలోనే తేలిపోనుంది. ప్రస్తుతానికి టీజర్ మాత్రం భయపెతోంది. ఆత్మలను బంధించే మంత్రగత్తె పాత్రలో ఈశ్వరి రావు నటించింది. తన కుటుంబాన్ని ఆత్మ నుంచి కాపాడుకునే పాత్రలో శ్రీరామ్ నటించాడు.ఇదే సమయంలో తన జీవితంలోని అత్యంత భయంకరమైన ఆత్మ గురించి ఈశ్వరి రావు పాత్ర చెబున్న క్రమంలో టీజర్ సాగుతుంది. నిజ ఘటనల మేరకు తెరకెక్కించారని టీజర్ లో చెప్పడం గమనార్హం.