Pooja Hegde : బుట్టబొమ్మ ప్రేమలో పడిందా? బాలీవుడ్ హీరోతో రిలేషన్ నిజమేనా?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన పూజా హెగ్డే ప్రస్తుతం తన సినిమాల కంటే వ్యక్తిగత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో ప్రేమలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై వీరిద్దరూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, సోషల్ మీడియాలో ఒకరికి ఒకరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం, అప్పుడప్పుడు కలిసి కనిపించడం వంటి విషయాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
వివరాలు
హిందీలో వరుస సినిమాలు..
ఇక పూజా హెగ్డే విషయానికి వస్తే, ఆమె ప్రస్తుతం తమిళంలో 'జన నాయకన్', హిందీలో 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' సినిమాల విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు రోహన్ మెహ్రా, బాలీవుడ్‌లో ప్రముఖ నటుడైన వినోద్ మెహ్రా కుమారుడు. ఆయన తల్లి పేరు కిరణ్ మెహ్రా. రోహన్ చిన్న వయసులోనే, 1990లో వినోద్ మెహ్రా మరణించడంతో తండ్రి ఖ్యాతిని దగ్గరగా అనుభవించే అవకాశం ఆయనకు దక్కలేదు. తండ్రి మరణం అనంతరం రోహన్ తన తల్లి, అలాగే తాతమ్మలతో కలిసి కెన్యాలోని మొంబాసాలో పెరిగాడు. ఉన్నత విద్య కోసం యూకేకు వెళ్లి, ఆపై ముంబైకి తిరిగి వచ్చి సినీ రంగంలో అడుగుపెట్టాడు.
వివరాలు
బజార్ సినిమాతో నటుడిగా ఎంట్రీ..
రోహన్‌కు సోనియా మెహ్రా అనే అక్క ఉంది. ఆమె 2007లో 'విక్టోరియా నం. 203' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. 1991లో జన్మించిన రోహన్ మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ తెరకెక్కించిన 'బాజీరావ్ మస్తానీ' చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశాడు. ఆ తరువాత 2018లో విడుదలైన 'బజార్' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టేలతో కలిసి నటించాడు. స్టాక్ మార్కెట్ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాలో రిజ్వాన్ అహ్మద్ పాత్రలో ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాతో బెస్ట్ మేల్ డెబ్యూ విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకున్నాడు.
వివరాలు
నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తలు..
తరువాత కూడా కంటెంట్‌కు ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులను ఎంపిక చేసుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. 2021లో '420 IPC' అనే లీగల్ డ్రామాతో ఓటీటీ ప్రపంచంలోకి ప్రవేశించాడు. అలాగే 2023లో వచ్చిన 'కాలా' వెబ్ సిరీస్‌లో ఫైనాన్షియల్ క్రైమ్ నేపథ్యంలో నటించాడు. వ్యక్తిగత విషయాలను ఎక్కువగా బయటపెట్టని రోహన్ మెహ్రా, గతంలో హీరోయిన్ తార సుతారియాతో దీర్ఘకాల సంబంధంలో ఉన్నాడు. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' విడుదలకు ముందే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందనే వార్తలు వెలువడ్డాయి. అయితే తరువాత వారు విడిపోయారు. ఇప్పుడు పూజా హెగ్డేతో సంబంధం ఉందనే వార్తలతో మరోసారి చర్చల్లోకి వచ్చాడు.