మాల్దీవ్స్ లో బర్త్ డే ను ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే
తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే, ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఈరోజు పూజా హెగ్డే పుట్టినరోజు.. ఈ సందర్భంగా సినిమా సెలబ్రిటీల నుండి అభిమానుల వరకు అందరూ పూజా హెగ్డే కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే పూజా హెగ్డే మాత్రం తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడానికి మాల్దీవ్స్ వెళ్లారు. మాల్దీవ్స్ లో తాను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. ఒకానొక వీడియోలో సముద్రపు ఒడ్డున, నెట్ బెడ్ పై పడుకొని పూజా హెగ్డే కనిపించారు. ఆ ఫోటోకు ప్రస్తుతం అందుబాటులో లేను అనే క్యాప్షన్ ని కూడా జతపరిచారు.