LOADING...
Pooja Hegde : బుట్టబొమ్మకు ఏమైంది? సినిమాలకు పూజా హెగ్డే గుడ్‌బై చెప్పబోతుందా..?
బుట్టబొమ్మకు ఏమైంది? సినిమాలకు పూజా హెగ్డే గుడ్‌బై చెప్పబోతుందా..?

Pooja Hegde : బుట్టబొమ్మకు ఏమైంది? సినిమాలకు పూజా హెగ్డే గుడ్‌బై చెప్పబోతుందా..?

వ్రాసిన వారు Moogati Shabari
Apr 09, 2026
01:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒక వైపు నటన, మరో వైపు అద్భుతమైన డ్యాన్స్‌, అలాగే తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకున్న పూజా హెగ్డే.. గత కొంతకాలంగా సినిమాలకు కొంత విరామం ఇచ్చింది. టాలీవుడ్‌లో తన ప్రాజెక్టులను తగ్గిస్తూ బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన ఆమె, త్వరలోనే పూర్తిగా సినీ రంగానికి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో కొన్ని పెద్ద సినిమాల అవకాశాలు వచ్చినప్పటికీ, డేట్స్‌ సమస్యల కారణంగా వాటిని వదులుకోవాల్సి వచ్చిందని సమాచారం. ఇక బాలీవుడ్‌లో కూడా కొత్త సినిమాలపై ఆమె ఆసక్తి తగ్గిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, ఆమె పూర్తిగా సినిమాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు గాసిప్స్‌ వస్తున్నాయి.

వివరాలు

సిల్వర్ స్క్రీన్‌కు దూరంగా హీరోయిన్..

ఇటీవలి కాలంలో ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడం, అలాగే వ్యక్తిగత జీవితంపై ఎక్కువ దృష్టి పెట్టాలనే ఆలోచన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఓ మై గాడ్, డీవిల్, ఆచార్య వంటి పలు భాషల్లో వచ్చిన సినిమాల్లో తన అందం, నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకులను మెప్పించిన పూజా హెగ్డే.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌కు దూరంగా ఉండబోతుందన్న వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బాలీవుడ్‌లో కూడా కొన్ని ప్రాజెక్టులు చేసినప్పటికీ, అవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సినిమాలకు గుడ్‌బై చెప్పబోతుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై పూజా హెగ్డే స్పందిస్తే తప్ప స్పష్టత రానట్టే కనిపిస్తోంది.

Advertisement