SSMB28: మహేష్ బాబుకు ఆ విషయంలో పెద్ద ఫ్యాన్ : పూజా హెగ్డే
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ఉన్న క్రేజ్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. తాజాగా మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న విషయంలో తెలిసిందే. ఇందులో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా పూజా హేగ్డే నటిస్తోంది. మహేష్ తో కలిసి రెండోసారి నటిస్తుండటంపై పూజా హెగ్డే ఆనందం వ్యక్తం చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన మహార్షి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో మహేష్ బాబు 28వ సినిమాలోనూ ఈ ముద్దగుమ్మకే అవకాశం వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది
విభిన్న గెటప్ లో పూజా హెగ్డే
మహేష్ బాబు తాజా చిత్రం గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ తన పాత్ర ఇప్పటివరకూ చేసిన సినిమాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుందని పేర్కొంది. ఇక మహేష్ బాబు అద్భుతమైన నటుడని, ప్రత్యేకించి మహేష్ వాయిస్ మాడ్యులేషన్ కి తాను ఫ్యాన్ అని చెప్పింది. ఇంతవరకూ చూడని గెటప్ లో మహేష్ బాబు ఈ సినిమాలో కనిపిస్తాడని తెలిపింది. ఇక పూజా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' ఏప్రిల్ 21న విడుదల కానుంది.