
బాలీవుడ్: సల్మాన్ ఖాన్, పూజా హెగ్డేలపై కురుస్తున్న ట్రోల్స్ వర్షం
ఈ వార్తాకథనం ఏంటి
ఇటు తెలుగులోనూ అటు హిందీలోనూ బిజీగా ఉంటున్న పూజా హెగ్డే, ఈ మధ్య కాలంలో సరైన విజయాన్ని అందుకోలేక పోయింది. ఇటీవలి కాలంలో ఆమె చేసిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి.
దాంతో ఇప్పుడు పూజకు హిట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన కిసీ కీ కిసీ కా జాన్ సినిమాలో నటిస్తోంది పూజా హెగ్డే. రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు.
అందువల్ల సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టాలని నయో లాగ్దా పాటను రిలీజ్ చేసారు. ఈ సాంగ్ పై ట్రోలింగ్ జరుగుతోంది.
ఈ పాటలో సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ కనిపించలేదని ట్రోలింగ్ చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్
డ్యాన్స్ బాలేదంటూ సల్మాన్ ఖాన్ పై విమర్శలు
పాటలో కెమిస్ట్రీ మాత్రమే కాదు సల్మాన్ ఖాన్ వేసిన స్టెప్పులు బాలేవంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
పాట సంగతి పక్కన పెడితే అటు సల్మాన్ ఖాన్ కి, ఇటు పూజా హెగ్డేకి ఇద్దరికీ ఈ సినిమా సక్సెస్ కావడం చాలా ముఖ్యం. గత కొన్నేళ్ళుగా సల్మాన్ ఖాన్ సినిమాలు బాక్సాఫీసు దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి.
అందుకే సల్మాన్ అభిమానులు కొంత ఆందోళనలో ఉన్నారు. పూజా హెగ్డే కూడా విజయం కోసం వేచి చూస్తోంది. మరి కిసీ కీ భాయ్ కిసీ కా జాన్ సినిమాతో వారిని విజయం వరిస్తుందో లేదో చూడాలి.
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేంటంటే, ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కూడా ఉన్నారు.