గుంటూరు కారం దారిలోనే ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్: పూజా హెగ్డే ఔట్?
గత రెండు మూడు రోజుల నుండి పూజా హెగ్డే గురించి అనేక వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా కనిపిస్తున్నారని తెలిసిందే. అయితే గుంటూరు కారం సినిమా నుండి పూజా హెగ్డే తప్పుకుందని ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రధానా హీరోయిన్ గా శ్రీలీల మాత్రమే ఉందని సమాచారం. ఇదే బాటలో ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ కూడా వ్యవహరిస్తుందని టాక్ వినబడుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఉంటుందని, సినిమా ప్రకటనకు ముందు వార్తలు వచ్చాయి. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, శ్రీలీలను ఉస్తాద్ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు.
రెమ్యునరేషన్ కారణం అంటూ వార్తలు వైరల్
ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోయిన్ గా శ్రీలీల చేస్తుందని ప్రకటన వచ్చిన తర్వాత, ఈ సినిమాలో మరో హీరోయిన్ గా పూజా హెగ్డే ఉంటుందని, ఆమె గురించి మరికొద్ది రోజుల్లో అప్డేట్ వస్తుందని అన్నారు. తాజా సమాచారం ప్రకారం, ఉస్తాద్ భగత్ సింగ్ నుండి పూజా హెగ్డే తప్పుకుందని అంటున్నారు. దీనికి ఖచ్చితమైన కారణం బయటకు రాలేదు కానీ పూజా హెగ్డే పారితోషికం భారీగా ఉండడమే కారణమని వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో నిజమేంటో తెలియాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ బృందమైనా లేదా పూజా హెడ్గే అయినా స్పందించాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.