Page Loader
Raju Punjabi: 40ఏళ్ల వయసులో ప్రముఖ గాయకుడు రాజు పంజాబీ కన్నుమూత 
40ఏళ్ల వయసులో ప్రముఖ గాయకుడు రాజు పంజాబీ కన్నుమూత

Raju Punjabi: 40ఏళ్ల వయసులో ప్రముఖ గాయకుడు రాజు పంజాబీ కన్నుమూత 

వ్రాసిన వారు Stalin
Aug 22, 2023
01:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాకు చెందిన ప్రముఖ గాయకుడు రాజు పంజాబీ(40) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. 10 రోజుల క్రితం హిసార్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 'దేశీ దేశీ', 'ఆచా లగే సే', 'తు చీజ్ లజవాబ్' వంటి హిట్ పాటలతో రాజు పంజాబీ హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌లో చాలా ఫేమస్ అయ్యారు. రాజు పంజాబీ చివరి పాట 'ఆప్సే మిల్కే యారా హమ్కో అచ్చా లగా థా' ఆగస్ట్ 12న విడుదలైంది. రాజు పంజాబీ మృతిపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆయన మరణం హర్యానాలోని సంగీత పరిశ్రమకు తీరని లోటుగా పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హర్యానా సీఎం ట్వీట్