Sharwanand Bhogi Movie: రెండుసార్లు వాయిదా.. ఇప్పుడు సెన్సార్ క్లియర్.. 'భోగి' రిలీజ్‌పై క్రేజీ అప్‌డేట్
ఈ వార్తాకథనం ఏంటి
చార్మింగ్ స్టార్ శర్వానంద్ అభిమానులు గత కొన్ని నెలలుగా 'భోగి' సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ నటించిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమైందనే ప్రచారం ప్రస్తుతం ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తికావడంతో కొత్త రిలీజ్ డేట్‌పై ఆసక్తి నెలకొంది.
వివరాలు
రెండుసార్లు వాయిదా పడిన సినిమా
వాస్తవానికి 'భోగి' సినిమా ఆగస్టు 28నే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే 1960ల నాటి వాతావరణాన్ని తెరపై సహజంగా చూపించేందుకు భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు చేయాల్సి వచ్చింది.
సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ఆ రిలీజ్ డేట్‌ను వదులుకున్నారు. ఆ తర్వాత పనులన్నీ పూర్తి చేసుకుని నవంబర్ 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.
కానీ అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో ఆ తేదీ కూడా మిస్ అయింది. దీంతో అభిమానులు మరోసారి నిరాశకు గురయ్యారు.
వివరాలు
'A' సర్టిఫికెట్.. నవంబర్ 27న విడుదల?
వరుస వాయిదాలతో ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ వినిపిస్తోంది.
ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుందని, సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికెట్ జారీ చేసిందని ప్రచారం జరుగుతోంది.
సెన్సార్ ప్రక్రియ పూర్తవడంతో నవంబర్ 27న 'భోగి'ని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ రిలీజ్ డేట్‌పై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వివరాలు
గంగా పాత్రలో శర్వానంద్
1960ల నాటి ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఓ గ్రామం నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామా ఇది.
అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే 'గంగా' అనే అత్యంత ఇంటెన్స్, పవర్‌ఫుల్ పాత్రలో శర్వానంద్ కనిపించబోతున్నాడు.
ఇప్పటివరకు ఫ్యామిలీ, క్లాస్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన శర్వా.. ఈసారి యాక్షన్, రక్తపాతంతో కూడిన పాత్రలో కనిపించనున్నాడు.
'A' సర్టిఫికెట్ రావడంతో సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ స్థాయిలో ఉంటాయనే ఆసక్తి పెరిగింది.
వివరాలు
భారీ బడ్జెట్‌తో నిర్మాణం
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన 'భోగి' నవంబర్ 27న విడుదల కానుందనే ప్రచారం నిజమవుతుందా? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.