
OG: వవర్ స్టార్ సంచలన రికార్డు.. వంద కోట్ల క్లబ్‌లో 'ఓజీ'
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'OG' మూవీ, భారీ హైప్ మధ్య వరల్డ్ వైడ్‌గా రెండు రోజుల క్రితం రిలీజ్ అయ్యింది. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించాడన్నారు. ప్రీమియర్స్ అన్ని ప్రాంతాల్లో రికార్డులు బద్దలైన OG, మొదటి రోజు అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ సాధించింది. మేకర్స్ ఆఫీషియల్ ప్రకటన ప్రకారం తొలి రోజు OG వరల్డ్ వైడ్ రూ. 154 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. షేర్ పరంగా రూ. 88 కోట్ల సమ్మితి సాధించింది.
Details
రెండో రోజు అత్యధిక కలెక్షన్లు
రెండవ రోజు కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. వర్షాల కారణంగా కొన్ని సెంటర్లలో కలెక్షన్స్ తగ్గినా, డీసెంట్ వసూళ్లను OG సాధించింది. రెండవ రోజు కలెక్షన్స్ తో OG, వందకోట్ల షేర్ రాబట్టిన సినిమాల జాబితాలో చేరింది. ఇప్పటివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో వందకోట్ల షేర్ సాధించడం జరగలేదు. OGతో తొలిసారి ఆయన ఈ ఘనతను సాధించాడు. వీకెండ్ నేపథ్యంలో ఈ రెండు రోజులు మరింత భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది. అలాగే, ఓవర్సీస్‌లో OG 4.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.