God Of War: ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీకి పవర్‌ఫుల్ టైటిల్.. ఆరోజే అధికారిక ప్రకటన?
ఈ వార్తాకథనం ఏంటి
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వరుసగా భారీ, క్రేజీ ప్రాజెక్టులతో కెరీర్‌ను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో 'డ్రాగన్' అనే యాక్షన్ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్న తారక్, ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన 'అరవింద సమేత' భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో, ఈ కొత్త చిత్రంపై అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమా కథాంశం కుమారస్వామి నేపథ్యంలో సాగుతుందని, ఆధ్యాత్మికతతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి ఒక విజువల్ వండర్‌గా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
వివరాలు
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటన
ఇదిలా ఉంటే, తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి 'గాడ్ ఆఫ్ వార్' (God Of War) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టైటిల్‌ను బట్టి చూస్తే, త్రివిక్రమ్ ఈసారి ఎన్టీఆర్‌ను ఇప్పటివరకు చూడని ఉగ్రరూపంలో ప్రదర్శించబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా అదే రోజున ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'డ్రాగన్' సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కూడా వచ్చే అవకాశం ఉండటం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
వివరాలు
త్వరలోనే అనౌన్స్‌మెంట్
ఒకే రోజు రెండు భారీ ప్రాజెక్టులకు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ వస్తే సోషల్ మీడియాలో భారీ హంగామా ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ఎన్టీఆర్, తన మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా యాక్షన్ డ్రామాలు, విజువల్ వండర్స్ రెండింటినీ సమతౌల్యంగా ఎంచుకుంటూ బలమైన లైనప్‌ను సిద్ధం చేసుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.