Kalki 2898 AD: కల్కి 2898 AD కలెక్షన్ ల ఊచకోత.. 4 రోజుల్లో 500 కోట్ల క్లబ్‌లో చేరిక
ఈ వార్తాకథనం ఏంటి
జూన్ 27న విడుదలైన కల్కి 2898 AD, ప్రభాస్ ,దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన మెగా బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ డ్రామా,కలెక్షన్ లలో పాత రికార్డులను తిరగరాసింది.
విడుదలైన 4వరోజున ఒక మరపురాని మైలురాయిని అధిగమించింది.నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అరుదైన రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది.
ఈ విషయాన్ని కల్కి చిత్ర నిర్మాణ సంస్థ 'వైజయంతీ మూవీస్' ఎక్స్‌లో పోస్టు చేసింది.
బాహుబలి ది కన్‌క్లూజన్,RRR,సాలార్ పార్ట్ 1 ,బాహుబలి ది బిగినింగ్ తర్వాత కల్కి ఇప్పుడు ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన ఐదవ తెలుగు సినిమా.
టాప్ ఐదు ఆల్-టైమ్ హైయెస్ట్ తెలుగు గ్రాసర్స్‌లో ప్రభాస్ నటించిన 4 సినిమాలు లీడ్‌లో ఉన్నాయి.
వివరాలు
రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంచనా
ప్రపంచ బాక్సాఫీస్ వద్ద మొదటి వారం ముగిసే సమయానికి కల్కి రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని భావిస్తున్నారు.
ఈ చిత్రం రూ. 1,500 కోట్ల ఎలైట్ క్లబ్‌లోకి ప్రవేశించగలదా లేదా అనేది సోమవారం నుండి ప్రారంభమయ్యే సినిమా బాక్సాఫీస్ పనితీరును బట్టి నిర్ణయించబడుతుంది.
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన, దిశా పటానీ, అన్నా బెన్ పశుపతి కీలక పాత్రల్లో నటించారు.
దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్ ఇతరులు ప్రత్యేక అతిథి పాత్రల్లో నటించారు.
కల్కి 2898 ADని ప్రముఖ నిర్మాత నిర్మించారు. చిత్ర నిర్మాత అశ్విని దత్. ప్రముఖ కోలీవుడ్ స్వరకర్త సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.