Loading...
Prabhas Fauzi:'ఫౌజీ'లో ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా ప్రభాస్.. దేశభక్తి కథతో పాన్ ఇండియా మూవీ!
'ఫౌజీ'లో ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా ప్రభాస్.. దేశభక్తి కథతో పాన్ ఇండియా మూవీ!

Prabhas Fauzi:'ఫౌజీ'లో ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా ప్రభాస్.. దేశభక్తి కథతో పాన్ ఇండియా మూవీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2026
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్' హీరోగా, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఫౌజీ'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తాజాగా కథాంశానికి సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ప్రభాస్ 'ఆజాద్ హింద్ ఫౌజ్‌కు చెందిన సైనికుడి పాత్రలో' కనిపించనున్నారని తెలుస్తోంది. మొదట ఆయన బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా సేవలందించి, అనంతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ పిలుపుతో ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరి భారత స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించిన యోధుడిగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.

వివరాలు

అధికారిక ప్రకటన వెలువడలేదు

అయితే ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ బయోపిక్ కాదు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన భారతీయ సైనికుల పోరాటం, త్యాగం, దేశభక్తిని ప్రధానంగా చూపించే కథగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం.

ఇందులో ప్రభాస్ పాత్ర ధైర్యం, త్యాగం, దేశభక్తి వంటి అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ కథాంశంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదిలా ఉంటే డిసెంబర్ 3న 'ఫౌజీ'ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

వివరాలు

కథానాయికగా ఇమాన్వి

ఆ పోస్టర్‌లో ప్రభాస్ గతంలో ఎప్పుడూ కనిపించని కొత్త అవతారంలో దర్శనమివ్వడంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన తదుపరి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' సినిమాలో నటించనున్నారు.

ఇందులో హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రీ కనిపించనుంది. అలాగే 'సలార్: పార్ట్ 2', 'కల్కి 2898 ఏడీ: పార్ట్ 2' చిత్రాల షూటింగ్‌లలో కూడా ప్రభాస్ త్వరలో పాల్గొననున్నారు.

ADVERTISEMENT