Prabhas: మరోసారి రాముడిగా ప్రభాస్..? 'జై హనుమాన్'లో కనిపించనున్నాడా?
ఈ వార్తాకథనం ఏంటి
బాహుబలిలో మహారాజుగా, 'కల్కి 2898 ఏడీ'లో కర్ణుడిగా, 'కన్నప్ప'లో రుద్రుడిగా ప్రభాస్ కనిపించిన తీరు ఆయన స్టార్‌డమ్‌కు మరో స్థాయి తీసుకొచ్చింది. అలాంటి ప్రభాస్ మరోసారి శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నారా? ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో ఇదే చర్చ జోరుగా సాగుతోంది. 'హనుమాన్'కు సీక్వెల్‌గా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న 'జై హనుమాన్'లో శ్రీరాముడి పాత్ర కోసం ప్రభాస్‌ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. 'జై హనుమాన్'లో హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రకూ అదే స్థాయిలో క్రేజ్ ఉన్న స్టార్‌ను తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట.
వివరాలు
ఇప్పటికే 'ఆదిపురుష్'లో శ్రీరాముడిగా కనిపించిన ప్రభాస్
ఈ క్రమంలోనే ప్రభాస్ పేరు పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రభాస్‌కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్, భారీ మాస్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఆయనను శ్రీరాముడిగా చూపిస్తే సినిమాకు దేశవ్యాప్తంగా భారీ హైప్ వస్తుందని ప్రశాంత్ వర్మ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం.
ప్రభాస్ ఇప్పటికే 'ఆదిపురుష్'లో శ్రీరాముడిగా కనిపించారు. అయితే ఆ సినిమాలో ఆయన లుక్, పాత్రను తెరపై ఆవిష్కరించిన విధానంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో 'జై హనుమాన్'లో మరోసారి ప్రభాస్‌ను రాముడిగా చూపించే అవకాశం వస్తే.. గత చిత్రానికి పూర్తి భిన్నంగా, మరింత గంభీరంగా, దైవత్వం ఉట్టిపడేలా పాత్రను డిజైన్ చేయాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నట్లు టాక్.
వివరాలు
ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడలేదు
అయితే 'జై హనుమాన్'లో ప్రభాస్ కేవలం గెస్ట్ అప్పియరెన్స్ తరహాలో కనిపిస్తారా? లేక కథలో కీలకమైన పాత్రను పోషిస్తారా? అనే విషయంలో ప్రస్తుతానికి స్పష్టత లేదు.
రాముడిగా ప్రభాస్‌ను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి.. 'ఆదిపురుష్' సమయంలో వచ్చిన విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు, ఆ పాత్రలో ఆయనకు భారీ విజయాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రశాంత్ వర్మ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ వార్త నిజమై రిషబ్ శెట్టి హనుమంతుడిగా, ప్రభాస్ శ్రీరాముడిగా తెరపై కనిపిస్తే మాత్రం 'జై హనుమాన్'పై అంచనాలు మరింత ఆకాశాన్ని తాకడం ఖాయం.