Happy Birthday Prabhas: 'ఒంటరిగా నడిచే బెటాలియన్'.. హీరో మాత్రమే కాదు, ఆయనే ఒక పరిశ్రమ
ఈ వార్తాకథనం ఏంటి
'ఒంటరిగా నడిచే ఒక బెటాలియన్...' ఇదే ప్రభాస్ కొత్త సినిమా పోస్టర్‌పై కనిపించే శీర్షిక. ఇది కేవలం సినిమా కథకు లేదా ఆయన పాత్రకు మాత్రమే కాక,ప్రభాస్ వ్యక్తిగత జీవిత ప్రయాణానికి కూడా పూర్తిగా సరిపోతుంది. ఈ రోజు ప్రభాస్ కేవలం హీరోగానే కాదు, ఒక పరిశ్రమగా కూడా నిలిచిపోయాడు.ఆయన పేరుతో రూ.వేల కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగిపోతుంటాయి అన్ని సినిమాలూ ఒక లెక్క...ప్రభాస్ సినిమా ఒక లెక్క అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. తెలుగు సినిమా పరిశ్రమను రూ.వందల కోట్ల నుంచి వేల కోట్లకు మార్చేసిన ఘనత ఆయనదే. ప్రభాస్ కి కథ నచ్చిందన్న మాట వింటే చాలు,ఆ సినిమాపై ఇటు దక్షిణ భారతం నుంచీ,అటు ఉత్తరాది వరకూ ఉత్సాహంగా వ్యాపారాలు సాగిపోతుంటాయి.
వివరాలు
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు
ఓవర్సీస్ మార్కెట్ ప్రభాస్ సినిమాల కోసం మరింత ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటుంది. నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన అన్ని రంగాల్లో ఆయన సినిమాలు విశేష ఆకర్షణ కలిగిస్తాయి. ఉత్తరాదిలో తెలుగు హీరోలు పేరు పొందడానికి ప్రయత్నించినప్పటికీ విజయవంతం కాలేకపోయారు. భాషా పరిమితులు, మార్కెట్ దూరం పెద్ద అడ్డంకిగా నిలిచాయి. కానీ 'బాహుబలి' సినిమాల తరువాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపును సంపాదించారు. తెలుగు, హిందీ హద్దులు ఆయనకు అడ్డంకి కావు. దక్షిణాదిలోని అభిమానులే కాక,ఉత్తరాది ప్రేక్షకులు కూడా "డార్లింగ్" అని ఆప్యాయంగా పిలుస్తారు. తెరపై ప్రభాస్ రూపం మాత్రమే కాక, ఆయన మాట కూడా సినిమాకు కొత్త శక్తిని తీసుకురావడం విశేషం. ఇటీవల 'మిరాయ్' సినిమా ఘన విజయాన్ని సాధించడం ఇందుకు ఉదాహరణ.
వివరాలు
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి.. ఇదే ప్రభాస్ విజయ రహస్యం
ప్రభాస్ సినిమాలు ఎల్లప్పుడూ భారీ కథలుగా, పెద్ద బడ్జెట్‌తో రూపొందిస్తారు. 'బాహుబలి: ది కన్‌క్లూజన్', 'సలార్ 2', 'కల్కి 2' వంటి సినిమాల కథలు భవిష్యత్తులో మరింత విస్తృతం అయినా ఆశ్చర్యం లేదు. కథానాయకుడిగా అంత ఎత్తుకు ఎదిగినా సరే, ప్రభాస్ తన స్వభావంలో ఎప్పటికీ ఒకే విధంగా ఉంటారు. తక్కువగా మాట్లాడి, ఎక్కువ పనిచేయడం.. ఇదే ఆయన విజయ రహస్యం. ఈ రోజు ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన నటిస్తున్న కొత్త సినిమాల రీలీర్స్, అప్‌డేట్స్ అభిమానులకు సందడి, ఉత్సాహం కలిగిస్తాయి. వాటితో సంబరాలు చేసుకొనేందుకూ అభిమానులు సిద్ధమైపోయారు.