TheRajaSaab : ప్రభాస్ కూల్ లుక్ వైరల్.. రొమాంటిక్ రెబల్ సాబ్ వచ్చేస్తున్నాడు!
ఈ వార్తాకథనం ఏంటి
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్‌పై కొనసాగుతుండగానే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పిరిట్' చిత్రాన్ని కూడా ప్రారంభించాడు. డార్లింగ్. వరుసగా షూటింగ్స్‌తో నిండిపోయిన షెడ్యూల్ మధ్య ప్రభాస్ కొంత విరామం తీసుకుని *బాహుబలి: ది ఎపిక్* స్పెషల్ స్క్రీనింగ్ కోసం జపాన్‌కు వెళ్లాడు. అయితే జపాన్‌లో భూకంపం సంభవించిన వార్తలు వెలుగులోకి రావడంతో రెబల్ స్టార్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. దీనిపై దర్శకుడు మారుతీ స్పందిస్తూ - ప్రభాస్ పూర్తిగా సేఫ్‌గా ఉన్నాడని, ఆందోళన అవసరం లేదని తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.
Details
ప్రభాస్ తాజా ఫోటోలు వైరల్
ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభాస్ తాజా ఫోటోలు బయటకు వచ్చాయి. అమ్మాయిల కలల రాకుమారుడిలా, చేతిలో పువ్వులు పట్టుకుని, కుర్చీలో రిలాక్స్‌గా కూర్చొని, క్యూట్ స్మైల్‌తో కెమెరాకు పోజులు ఇస్తూ కనిపిస్తున్నాడు రెబల్ సాబ్. "రెబెల్ సాబ్... రెబెల్ సాబ్... రొమాంటిక్ రెబెల్ సాబ్... వస్తున్నాడు స్టెప్ అసైడ్, స్టెప్ అసైడ్... లుకింగ్ ఫర్ ది బ్రైడ్... ప్యాన్-ఇండియా నంబర్ వన్... ప్యాన్-ఇండియా నంబర్ వన్ బ్యాచిలర్ ప్రభాస్ ఏలే అంటూ సోషల్ మీడియాలో ఆయన తాజా స్టిల్స్‌పై అభిమానులు కామెంట్లు కురిపిస్తున్నారు. ప్రభాస్ కొత్త లుక్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల్లో భారీ ఎగ్జైట్‌మెంట్‌ను రేపుతున్నాయి.