LOADING...
Spirit Movie:'స్పిరిట్‌'లో ప్రభాస్‌ డ్యూయల్‌ షేడ్స్‌.. అంచనాలు అంతకుమించి!
'స్పిరిట్‌'లో ప్రభాస్‌ డ్యూయల్‌ షేడ్స్‌.. అంచనాలు అంతకుమించి!

Spirit Movie:'స్పిరిట్‌'లో ప్రభాస్‌ డ్యూయల్‌ షేడ్స్‌.. అంచనాలు అంతకుమించి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2025
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్‌ హీరోగా, సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'స్పిరిట్‌ (Spirit)' చిత్రంపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఇటీవల ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'వన్‌ బ్యాడ్‌ హ్యాబిట్‌' వీడియో, ఈ సినిమాపై మరింత ఆసక్తి రేపింది. వీడియోలో ప్రభాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించడం, అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న నేపథ్యంలో, టాలీవుడ్‌ వర్గాల్లో కొత్త వార్త ఒకటి చర్చనీయాంశమైంది. సినిమా కథలో పోలీస్‌ యాక్షన్‌ మాత్రమే కాకుండా మాఫియా బ్యాక్‌డ్రాప్‌ కూడా ప్రధానంగా ఉండబోతోందని సమాచారం. ముఖ్యంగా ద్వితీయార్ధంలో మాఫియా అంశం చుట్టూ తిరిగే సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్‌ చేయనున్నాయని తెలుస్తోంది.

Details

హీరోయిన్ గా త్రిప్తి డిమ్రీ

ఇదే కథకు ప్రధాన బలం అవుతుందని, మొత్తం సినిమాకు మలుపు తిప్పే ఘట్టంగా మారనుందని టాక్‌. ఇటీవల విడుదలైన ప్రమో వీడియోలో నటీనటుల వివరాలు కూడా బయటకొచ్చాయి. ప్రభాస్‌తో పాటు త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పోలీస్‌ పాత్రలో ప్రభాస్‌ శక్తివంతమైన లుక్‌తో ఆకట్టుకోనున్నారని చిత్ర బృందం తెలిపింది. 'యానిమల్‌'లో రణ్‌బీర్‌ కపూర్‌ చూపించిన ఇంటెన్స్‌ యాక్షన్‌ తరహాలోనే ప్రభాస్‌ కూడా ఈ సినిమాలో రెండు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నారు. 'స్పిరిట్‌'తో సందీప్‌ రెడ్డి వంగా మరోసారి పాన్‌ ఇండియా స్థాయిలో తన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది.