LOADING...
Prabhas: 'సింగ్ గీతం'లో నాకు అవకాశం ఎందుకు ఇవ్వలేదు? : ప్రభాస్

Prabhas: 'సింగ్ గీతం'లో నాకు అవకాశం ఎందుకు ఇవ్వలేదు? : ప్రభాస్

వ్రాసిన వారు Moogati Shabari
Jun 21, 2026
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

'సింగ్ గీతం' సినిమాలో తనకు అవకాశం ఎందుకు కల్పించలేదని హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్‌ను సరదాగా ప్రశ్నించారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మించారు. ఇటీవల ఈ సినిమాను వీక్షించిన ప్రభాస్, అనంతరం నాగ్ అశ్విన్‌తో హాస్యభరితంగా మాట్లాడారు.

వివరాలు

'కమ్ టు మై రూం' అంటూ నాగ్ అశ్విన్‌ను సీరియస్‌గా పిలిచిన ప్రభాస్..

సినిమా పూర్తయ్యాక 'కమ్ టు మై రూం' అంటూ నాగ్ అశ్విన్‌ను సీరియస్‌గా పిలిచిన ప్రభాస్, ''నా గొంతులో ఏమైనా లోపం ఉందా? నాకు పాటలు పాడటం రాదని అనుకున్నావా? కొత్త ప్రయోగాలు చేయనని భావించావా? మరి 'సింగ్ గీతం'లో నాకు అవకాశం ఎందుకు ఇవ్వలేదు?'' అంటూ సరదాగా ప్రశ్నించారు. ఈ హాస్యభరిత సంభాషణకు సంబంధించిన ప్రచార వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ అభిమానులను అలరిస్తోంది.

Advertisement