ప్రాజెక్ట్ కె నుండి ప్రభాస్ లుక్ విడుదల: గేమ్ ఛేంజ్ చేయడానికి వచ్చేసిన హీరో
గతకొన్ని రోజులుగా ప్రాజెక్ట్ కె సినిమా నుండి అప్డేట్ల మీద అప్డేట్లు వస్తున్నాయి. అమెరికాలో జరుగుతున్న కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ప్రాజెక్ట్ కె టీమ్ పార్టిసిపేట్ చేయబోతున్న క్రమంలో ఈ అప్డేట్లు వస్తున్నాయి. తాజాగా ప్రభాస్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ డిఫరెంట్ గా ఉంది. రోబో మాదిరి సూట్ వేసుకున్నట్టు, వేరే ఎక్కడి నుండో భూమి మీద దిగినట్టుగా ప్రభాస్ కనిపించారు. పోస్టర్ చూసిన తర్వాత ఇప్పటివరకు ప్రాజెక్ట్ కె నుండి రివీల్ అయిన రెండు చేతులు ఢీకొనే పోస్టర్లలో ఒక చేయి ప్రభాస్ దే అని అర్థమవుతోంది.
ప్రాజెక్ట్ కె సినిమాలో పురాణాలకు సంబంధించిన అంశాలు?
రెండు చేతులు ఢోకొట్టే పోస్టర్లలో మరో చేయి విలన్ దా లేక మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ దా అన్నది తెలియాలి. ప్రభాస్ లుక్ చూస్తుంటే సైన్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతున్న మూవీలో పురాణాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయని అర్థమవుతోంది. ముఖ్యంగా ప్రభాస్ జుట్టు, ముడివేసినట్టుగా ఉండడం ఇలాంటి సందేహాలను మోసుకొస్తుంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే గ్లింప్స్ విడుదలయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గ్లింప్స్, జులై 21న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటాని, కమల్ హాసన్ నటిస్తున్నారు.