LOADING...
Prabhas - Hanu Raghavapudi: ప్రభాస్‌ కొత్త సినిమా.. పాండవుల పక్షాన ఉన్న కర్ణుడంటూ థీమ్ రివీల్
ప్రభాస్‌ కొత్త సినిమా.. పాండవుల పక్షాన ఉన్న కర్ణుడంటూ థీమ్ రివీల్

Prabhas - Hanu Raghavapudi: ప్రభాస్‌ కొత్త సినిమా.. పాండవుల పక్షాన ఉన్న కర్ణుడంటూ థీమ్ రివీల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2025
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) నటిస్తున్న తాజా సినిమా పీరియాడికల్ యాక్షన్-డ్రామాగా రూపొందుతోంది. ప్రభాస్‌కు జంటగా సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ను మూవీ టీమ్ పంచుకుంది. రేపు ఉదయం సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారని చిత్రబృందం తెలిపింది. తాజాగా విడుదలైన పోస్టర్‌కి 'పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు' అనే క్యాప్షన్ ఇచ్చారు. అలాగే 1932 నుంచి ఇతడి కోసం అందరూ వెతుకుతున్నారు, ఒంటరిగా పోరాడిన బెటాలియన్‌ అనే ట్యాగ్‌లైన్‌లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Details

పరిశీలనలో ఫౌజీ వర్కింగ్ టైటిల్

ప్రస్తుతం ఈ సినిమా వర్కింగ్ టైటిల్‌గా 'ఫౌజీ'తో (Fauji) ప్రచారంలో ఉంది. భారీ బడ్జెట్‌తో, విభిన్నమైన కథనంతో రూపొందుతోన్న ఈ చిత్రం 1930వ దశకంలో జరిగిన సంఘటనల ఆధారంగా రానుందట. ప్రభాస్‌ సైనికుడిగా కనిపించనున్నాడు. మాతృభూమి ప్రజలకు న్యాయం అందించడానికి ఒక యోధుడు చేసే పోరాటం కథా కేంద్రంగా ఉంటుందని హను రాఘవపూడి తెలిపారు. వాస్తవ సంఘటనలకు కొంత ఫిక్షన్ జోడిస్తూ ఈ సినిమా రూపొందించారని చెప్పారు.

Advertisement