LOADING...
Prabhas Biker: మరోసారి పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. శర్వానంద్ మూవీకి సపోర్ట్
మరోసారి పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. శర్వానంద్ మూవీకి సపోర్ట్

Prabhas Biker: మరోసారి పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. శర్వానంద్ మూవీకి సపోర్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 23, 2026
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ మరోసారి తన సహనటులపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. తన సినిమాల ప్రమోషన్ విషయంలో పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోయినా, ఇతర హీరోల సినిమాలకు మాత్రం ఎప్పుడూ సపోర్ట్ ఇస్తారనే అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. తాజాగా హీరో శర్వానంద్ నటించిన 'బైకర్' సినిమాకు ఆయన మద్దతుగా నిలవడం దీనికి నిదర్శనంగా మారింది. బైక్ రేసింగ్ నేపథ్యంలో రూపొందిన 'బైకర్' చిత్రం ట్రైలర్‌ను మార్చి 22న విడుదల చేశారు. ఇండియాలో తొలి మోటోక్రాస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ట్రైలర్‌ను షేర్ చేస్తూ, "ట్రైలర్ వైబ్ చాలా బాగుంది. ఎంగేజింగ్‌గా కనిపిస్తోంది.

వివరాలు

శర్వానంద్ స్పందన

శర్వానంద్‌కు, యూవీ క్రియేషన్స్‌కు, మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు. ఏప్రిల్ 3న బిగ్ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నానంటూ పోస్ట్ చేశారు. ప్రభాస్ ఇచ్చిన సపోర్ట్‌కు శర్వానంద్ కృతజ్ఞతలు తెలిపారు. థ్యాంక్యూ ప్రభాస్ అన్నా.. ఇది మాకు చాలా ముఖ్యం. మీ సపోర్ట్‌తో మేం మరింత ఉత్సాహంగా ఉన్నాం. డాల్సీ సినిమా, ఎపిక్, 4డీఎక్స్, పీసీఎక్స్ ఫార్మాట్లలో ఇండియాలో తొలి మోటోక్రాస్ ఫిల్మ్‌ను ఎంజాయ్ చేయండి. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రభాస్ పోస్ట్‌పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. "తన సినిమాలను కంటే ఇతర హీరోల సినిమాలను ఎక్కువగా ప్రమోట్ చేస్తాడు.. మా డార్లింగ్ బంగారం" అంటూ ఒక అభిమాని కామెంట్ చేశారు.

వివరాలు

'బైకర్' సినిమా వివరాలు

'బైకర్' రేసింగ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శర్వానంద్‌కు తండ్రిగా, మెంటార్‌గా నటించినట్లు సమాచారం. ఈ సినిమా ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో సంక్రాంతి 2026లో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన శర్వానంద్, 'బైకర్'పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ చిత్రం బంపర్ హిట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సహనటుల సినిమాలకు ఎప్పుడూ అండగా నిలిచే ప్రభాస్, 'బైకర్'కు సపోర్ట్ ఇవ్వడం మరోసారి ఆయన వ్యక్తిత్వాన్ని చూపించింది.

Advertisement